Dhoni| టీమిండియా.. వెరీ డెంజరస్

టీమిండియా.. వెరీ డెంజరస్
- మనోళ్లు రెచ్చిపోవడం ఖాయం
- పొట్టి ప్రపంచకప్ భారత్ గెలిచే చాన్స్
- మిగతా అన్ని జట్లు బలంగానే ఉన్నాయి
- మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని
- ఈ నెల 7వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్
Dhoni| వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించే ఈ టోర్నీకి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారా.. అనే చర్చ మొదలైంది. డిపెండింగ్ చాంపియన్ భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రముఖులు, అభిమానులు చెబుతున్నారు. అయితే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దీనిపై తన అభిప్రాయాన్ని భిన్నంగా వ్యక్తం చేశారు.
టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ప్రమాదకరమైన జట్టు అని, అన్ని జట్లలోకి టీమిండియా చాలా బలంగా ఉందన్నారు. మన కుర్రాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని, వరల్డ్‌కప్‌లో రెచ్చిపోవడం గ్యారెంటీ అని ధోనీ అన్నారు. పొట్టి ఫార్మాట్‌లో ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, భారత ఆటగాళ్లందరికీ ఒత్తిడిలో ఆడిన అనుభవం ఉందన్నారు. ఎవరు ఏ పాత్ర పోషించాలో జట్టులోని ప్రతీఒక్కరికీ స్పష్టత ఉందన్నారు. కాకపోతే మ్యాచ్ జరిగే వేదికల్లో వాతావరణం తనను కలవరపరుస్తోందని ధోనీ చెప్పారు. శీతాకాలం కావడంతో కొన్ని నగరాల్లో మంచు కురుస్తోందని, మ్యాచ్ పై దీని ప్రభావం చాలా ఉంటుందని వివరించారు. తాను ఆడే సమయంలోనూ మంచు అంటే భయాందోళనలకు గురయ్యే వాడినని చెప్పారు. ఇలాంటి సమయంలో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని ధోని చెప్పుకొచ్చారు.
