యూరియా కోసం క్యూలో..

యాదాద్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ : యూరియా (Urea) కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు (Farmers) రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా రాజాపేట మండలం కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద యూరియా కోసం రైతులు పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లను క్యూ లైన్ పెట్టారు.
వ్యవసాయ పనులు చేస్తూ యూరియా (Urea) కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్‌లో ఎక్కువ సేపు నిలబడ లేక పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌లను పెడుతున్నారు. రైతులకు (Farmers) అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని రైతులు కోరారు.
