Women’s Health | ఆరోగ్యానికి అద్భుతమైన నల్ల వెల్లుల్లి…

Women’s Health | మహిళల సమస్యలపై ప్రత్యేక ప్రభావం
Women’s Health | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వెల్లుల్లి అంటే వంటల్లో రుచి పెంచే సాధారణ పదార్థమే కాదు… ఆరోగ్యానికి అద్భుతమైన మిత్రుడు కూడా. అందుకే దాదాపు ప్రతి వంటకంలో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. అయితే, ఈ సాధారణ వెల్లుల్లికంటే ప్రత్యేకంగా ఉండే “నల్ల వెల్లుల్లి” గురించి చాలా మందికి తెలియదు.
సాధారణ వెల్లుల్లినే అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ తేమ ఉన్న వాతావరణంలో కొన్ని వారాల పాటు ప్రత్యేక పద్ధతుల్లో ఉంచి నల్ల వెల్లుల్లిగా మారుస్తారు. ఇది ఒక్కరోజులో తయారయ్యేది కాదు. సుమారు 4 నుంచి 6 వారాల పాటు నెమ్మదిగా జరిగే ప్రక్రియలో వెల్లుల్లి పైభాగం గోధుమ రంగులోకి మారి, లోపల రెబ్బలు నల్లగా, మెత్తగా, రసంతో నిండుగా మారుతాయి.

ఇంట్లో ఈ ప్రక్రియ కొంత కష్టంగా ఉండటం వల్ల మార్కెట్‌లో దొరికే నల్ల వెల్లుల్లిని ఉపయోగించడం సులభం. వీటిని గాలి చొరబడని డబ్బాల్లో లేదా సీసాల్లో నిల్వ చేస్తే రుచి, వాసన, తేమ అలాగే ఉంటాయి. సాధారణ వెల్లుల్లితో పోలిస్తే నల్ల వెల్లుల్లి రుచి కొద్దిగా తియ్యగా ఉంటుంది. అందుకే పాస్తా, సలాడ్ డ్రెస్సింగ్స్, శాండ్‌విచ్‌లలో కూడా ఉపయోగిస్తారు.
Women’s Health | ఔషధ గుణాల ఖజానా
రుచిలోనే కాదు, పోషకాల పరంగా కూడా నల్ల వెల్లుల్లి ఎంతో గొప్పది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్, వాపు, కంటి సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును తగ్గించడంలో సహాయపడతాయి.

నల్ల వెల్లుల్లిలో ఉండే “అలిసిన్” అనే సమ్మేళనం శరీర జీవక్రియలను వేగవంతం చేస్తుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, క్యాలరీలు కరిగి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
ఇది రక్తంలో చెడు కొవ్వులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని సమర్థిస్తున్నాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో నల్ల వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని సమ్మేళనాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. తరచూ జలుబు, జ్వరాలు వచ్చే వారికి ఇది సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది.
Women’s Health | క్యాన్సర్ నుంచి రక్షణ

నల్ల వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో క్యాన్సర్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
మహిళల ఆరోగ్యానికి మేలు
ముఖ్యంగా మహిళలకు నల్ల వెల్లుల్లి ఎంతో ఉపయోగకరం. నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్, అలసట వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. పీసీఓఎస్, థైరాయిడ్ సమస్యలను నియంత్రించడంలో సహకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఎముకలు, మెదడుకు బలం
నల్ల వెల్లుల్లిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలంగా ఉంచుతాయి. దీర్ఘకాలంలో ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలను దూరంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
షుగర్ నియంత్రణలో సహాయకారి
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కూడా నల్ల వెల్లుల్లి సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణుల్లో వచ్చే జెస్టేషనల్ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

తీసుకునే ముందు జాగ్రత్తలు
అయితే ప్రతి ఒక్కరికీ నల్ల వెల్లుల్లి అనుకూలంగా ఉండకపోవచ్చు. కొంతమందిలో అలర్జీలు, కడుపు నొప్పి, రక్తం పలుచబడటం వంటి సమస్యలు కనిపించవచ్చు. అందువల్ల మొదట కొద్దిమాత్రలో తీసుకుని శరీరానికి సరిపోతుందో లేదో పరీక్షించుకోవాలి.
అలాగే నిపుణుల సలహా మేరకు మితంగా తీసుకోవడం మంచిది. అధికంగా తీసుకుంటే లాభం కంటే నష్టం ఎక్కువయ్యే అవకాశం ఉంది.
మొత్తం మీద, నల్ల వెల్లుల్లి చిన్న పదార్థమే అయినా… దాని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఎంతో గొప్పవిగా నిలుస్తాయి.
CLICK HERE TO READ MORE : 2ndpregnancy | రెండో గర్భం ఎందుకు కష్టమవుతుంది..