ఘనంగాస్వయంపరిపాలన దినోత్సవం.

ఘనంగాస్వయంపరిపాలన దినోత్సవం.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లిమండల పరిషత్ ప్రాథమికపాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్ఎం గా రిషిక , మండల విద్యాధికారిగా సౌమ్య ప్రధానోపాధ్యాయులుగా ప్రదీప్ పిఈటి గా రంజిత్ చంద్రశేఖర్ ఉపాధ్యాయులుగా అక్షిత నందకుమార్ అవినాష్ చంద్రశేఖర్ మీనాక్షి రాధిక అజయ్ కుమార్ మంజునాథ్ హర్షవర్ధన్ శ్రీనిధి చక్కగా వ్యవహరించారు. పాఠశాలలో విద్యార్థులు స్వయం పరిపాలన వేడుకలను సర్పంచ్ పరిశీలించి విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలోసర్పంచ్, ఆర్.నర్సిములు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మమ్మ, హెచ్ఎం ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply