మెడికల్ కాలేజీకి భర్త బాడీ…
- అంతిమ కోరిక తీర్చిన భార్య
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో ( రాయలసీమ) : అధ్యాపకులైన తన భర్త అంతిమ కోరిక మేరకు ఆయన మృతదేహాన్ని అయన భార్య వైద్య పరిశోధనల కోసం అప్పగించిన అరుదైన ఉదంతం ఇది. వివిధ విద్యాసంస్థల్లో వృక్ష శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డా.కె.శివాజీ (doctor sivaji) అనారోగ్యంతో టి టి డి చెందిన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) చికిత్స పొందుతూ మరణించారు.
టిటిడిలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న టీటీడీ మహిళా ఉద్యోగినుల సంఘం అధ్యక్షురాలు కట్టమంచి కెఎల్ ఇందిర TTD superintendent Indira) ఆయన మృత దేహాన్ని స్విమ్స్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ అనాటమీ (padmavathi medical collage anatomy) విభాగానికి చేసినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు .
తన భర్త కోరిక మేరకు కుటుంబ సభ్యుల సమ్మతితో ఆమె మధ్యాహ్నం కాలేజికి వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించినట్టు పేర్కొన్నారు.డాక్టర్ బాలాజీ మృతికి సంతాపం తెలియచేసిన స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ వి కుమార్ , స్విమ్స్ వైద్యులు ఆమె సహృదయంతో, విశాల దృక్పథంతో భర్త మృతదేహాన్ని కళాశాల కు అప్పగించినందుకు అభినందనలు తెలిపారు
