ప్రజాహితమే ప్రజాప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లెందు, ఆంధ్రప్రభ : ప్రజాహితమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 7, 8 వార్డుల్లో నిర్వహించిన వార్డు సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని, అయినప్పటికీ అప్పులపై వడ్డీలు చెల్లిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల కాలంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు వార్డు సభలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సందీప్, మున్సిపల్ చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ రాజు, వార్డు సభ్యులు రాజు, రేఖా రవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply