శిథిలావస్థ ఇంటిని పరిశీలించిన చైర్ పర్సన్…

శిథిలావస్థ ఇంటిని పరిశీలించిన చైర్ పర్సన్…

మంత్రి వివేక్ తో మాట్లాడి మంజూరు చేపిస్తామని వెల్లడి
వృద్ధురాలికి అండగా చైర్‌పర్సన్

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు శ్రీనివాస్ నగర్‌లో శిథిలావస్థకు చేరిన ఇంటిని మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ గోడిసెల సంధ్యారాణి – రాజారమేష్ మంగళవారంపరిశీలించారు. ఈదురుగాలులకు ఇంటి పైకప్పు లేచిపోయి శిథిలమైన ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్న వితంతు వృద్ధురాలు పాశం బూధమ్మను చైర్‌పర్సన్ పరామర్శించారు. వర్షాకాలంసమీపిస్తుండటంతో ఇల్లు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ బాధితురాలి సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి ఇందిరమ్మ పథకం కింద బూధమ్మకు ఇల్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇల్లు మంజూరు కావడంలో జాప్యం జరిగితే తక్షణ సహాయం అందిస్తామని, బీఆర్ఎస్ పార్టీబాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటుందనిభరోసాఇచ్చారఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామిడి ఉమాదేవి, రామిడి కుమార్, యూత్ నాయకులు లక్ష్మీకాంత్, మణి, కాలనీ వాసులు రవళి, విజయ, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply