Bhimgal Town | ఆదరించండి.. అందుబాటులో ఉంటా

Bhimgal Town | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : ఒకటో వార్డు సభ్యులకు అందుబాటులో ఉండి సేవ చేసే అవకాశం ఇవ్వాలని వాక మహేష్ కోరారు.శనివారం ఒకటో వార్డు లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్తిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.వార్డు లో ఉన్న ప్రతి ఓటరు అధికార పార్టీ గుర్తు హస్తం కు ఓటు వేయాలని కోరారు. గత మూడేండ్లుగా కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారం లేకున్నా సేవ చేస్తున్నానని అన్నారు. అందరికి పరిచయం ఉన్న వ్యక్తిగా తనను ఆదరించాలని వేడుకున్నారు.

మున్సిపల్ కౌన్సిలర్ గా ఒకటో వార్డు నుండి తనని గెలిపిస్తే వార్డు లో మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్స్ నిర్మాణం చేయిస్తానని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాల్కొండ నియోజకవర్గం ఇన్‌చార్జి ముత్యాల సునిల్ కుమార్ సహకారంతో ఒకటో వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.