ఉమ్మడి స్థలం కబ్జా ప్రయత్నంపై రక్షణ కావాలి

ఉమ్మడి స్థలం కబ్జా ప్రయత్నంపై రక్షణ కావాలి

భీమవరం, ఆంధ్రప్రభ : తమకు సంబంధించిన ఉమ్మడి స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఆ స్థలాన్ని రక్షించాలని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో అనంత శ్రీరామ్ తన తండ్రి చేగొండి వీర వెంకట సత్యనారాయణతో కలిసి ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఇంటి ముందు ఉన్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

ఈ స్థలం వివాదం కోర్టులో ఉన్నప్పటికీ, బెదిరింపులకు పాల్పడి మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వృత్తిరీత్యా తాను వేరే చోట నివసిస్తున్నప్పటికీ, స్థానికంగా ఉన్న తన తల్లిదండ్రులకు రక్షణ అవసరమని తెలిపారు.

గతంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని, ఆ రిజిస్ట్రేషన్ చెల్లదంటూ నరసాపురం కోర్టులో కేసు వేసినట్లు పేర్కొన్నారు. కోర్టులో కేసు కొనసాగుతుండగానే ఈ నెల 17న మళ్లీ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం జరిగిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి ఇచ్చిన పీజీఆర్ఎస్‌లో కోరారు.


Leave a Reply