పర్యావరణహితంగా అన్నదానం

పర్యావరణహితంగా అన్నదానం

-మెండోరా లో ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు నిషేధం
-పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని మెండోరా గ్రామంలో పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం రోజు పర్యావరణహితంగా సన్రైజర్స్ యూత్, గ్రామ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెండోరా గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్ ఆధ్వర్యంలో పాలకవర్గం చేసిన తీర్మానం మేరకు ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులను అన్నదాన సత్రంలో వాడకూడదని నిర్ణయించారు.

ఈ మేరకు ఆకులతో తయారుచేసిన ప్లేట్లలోనే సుమారు 1000 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ గ్లాసులు వాడకుండా స్టీల్ గ్లాసులలోనే తాగునీటిని సరఫరా చేశారు. ప్లాస్టిక్ ప్లేట్లు వాడకుండా పర్యావరణ హితంగా ఉండేలా చెట్ల ఆకులతో చేసిన ప్లేట్లలో మెండోరా లో పెద్ద హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సన్రైజర్స్ యూత్ కు,వీడీసీ వారికి , గ్రామపంచాయతీ పాలకవర్గానికి గ్రామ ప్రజలు భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అంతకుముందు గ్రామ ఆస్థాన పండితులు నరేందర్ పంతులు రామాలయ ఆవరణలోని భారీ హనుమాన్ విగ్రహం ముందు యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేసి దశాబ్దకాలం పూర్తి అయిన సందర్భంగా పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అభిషేకం హారతి కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్, మండల బిజెపి అధ్యక్షులు ఆరే రవీందర్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పల్లె శేఖర్,మాజీ సర్పంచ్ రాజేందర్,వి డి సి అధ్యక్షుడు చెగంటి గంగాధర్, యూత్ నాయకులు వాల్గొట్ సునీల్, చిలివేరి భాస్కర్, సచిన్, దిలీప్,గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వీడిసి ప్రతినిధులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యజ్ఞ కార్యక్రమంలో సురేష్, స్వామి,ఆధ్వర్యంలో భక్తులు నాగార్జున, శేరీరాజు సతీసమేతంగా పాల్గొన్నారు.

Leave a Reply