కాలువకు భారీ గండి
కాలువకు భారీ గండి
- కొండారెడ్డి చెరువుకు నీరు పరుగు
( శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ) : శ్రీ సత్య సాయి జిల్లా తలపుల మండలం ఉబ్బరవాండ్లపల్లి వద్ద మంగళవారం హంద్రీనీవా కాలవకు గండి పడింది. దీంతో హంద్రీనీవా కాలవ నీరు భారీగా సమీపంలోని కొండారెడ్డి చెరువుకు చేరుతోంది. తలుపుల, హంద్రీనీవా 14వ ప్యాకేజి కాలువ నుంచి కొండారెడ్డి చెరువు కు నీటిని విడుదల చేయడానికి ఏర్పాటు చేసిన పైపు లైన్ కొట్టుకుపోయింది, దీంతో కాలువలోని నీరంతా చెరువుకు చేరుతుంది.

వాస్తవానికి కొండారెడ్డి చెరువు కోసం హంద్రీనీవా కాలువ అధికారులే మొదట్లో నీరు విడుదలకు చిన్నగా పిల్ల కాలువ తవ్వారు. పిల్ల కాలవ నుంచి సన్నగా కాలువ నీరు కొండారెడ్డి చెరువుకు వెళుతుండేది. అయితే ఉన్నపలంగా కాలవకు గండి పడినట్లుగా పెద్దగా నీరు కాలవ నుంచి చెరువుకు చేరుతోంది. ఏదేమైనా హంద్రీనీవా కాలువకు గండి పడిందనే ప్రచారం సాగుతోంది. తలుపుల, హంద్రీనీవా 14వ ప్యాకేజి కాలువ నుంచి కొందరెడ్డి చెరువు కు నీటిని విడుదల చేయడానికి ఏర్పాటు చేసిన పైపులైన్ కొట్టుకుపోయింది, దీంతో కాలువలోని నీరంతా చెరువుకు చేరుతుంది.




