Bellampalli | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

Bellampalli | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

Bellampalli | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : జరుగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో, మంచిర్యాల కార్పొరేషన్ లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా కో-ఆర్దినేటర్ మంతెన సంపత్ కుమార్ తెలిపారు. శనివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో జనసేన పార్టీకి ప్రజల్లోఎంతో ఆదరణ ఉందని… జన సైనికులకు టికెట్లు ఇచ్చేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలోసన్నద్ధమవుతున్నట్లు సంపత్ కుమార్ వెల్లడించారు.

కోల్ బెల్ట్ ప్రాంత ప్రధాన పట్టణ మైన బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34వ వార్డుల్లో పోటీ చేసేందుకే పార్టీ అధిష్టానం తగు నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పార్టీ అధిష్టానం ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు. జన సైనికులకు టికెట్లు ఇచ్చే విషయంలో వ్యూహరచన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు మంచిర్యాల కార్పొరేషన్ లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆయన వివరించారు.

ఎన్నికల్లో తమ పార్టీ యువతకు, మహిళలకు తగు ప్రాధాన్యతని ఇస్తుందని పేర్కొన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ 34 వార్డుల్లో జనసైనికులు పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 మున్సిపల్ వార్డు స్థానాలను జనసేన పార్టీగెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు జన సైనికులను రాజకీయ నాయకులుగా చేసేందుకు తమకు అవకాశం వచ్చిందని సంపత్ కుమార్ వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బలాన్ని నిరూపిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జనసేనరాష్ట్ర యూత్ అడహక్ కమిటి సభ్యుడు మాయ రమేష్, విద్యార్థి విభాగం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవుల సాగర్ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు సలిగంటి శ్రీనివాస్, మేకల పవన్ కళ్యాణ్, ముడుపు ప్రణయ్ శనిగారపు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply