వాహనం బోల్తా.. ఇద్దరికి తీవ్రగాయాలు
వారిని కాపాడిన పోలీసులు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా (Nandyal District) లోని జాతీయ రహదారి (National Highway) డోన్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. నందికొట్కూరు (Nandikotkur) నుంచి కదిరికి వెళ్తున్న టాటా సుమో వాహనం వెనుక టైర్ పగిలి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. ఈ వాహనము కర్నూలు (Kurnool) నుంచి బెంగళూరు పోయే హైవేలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందడంతో డోన్ టౌన్ సీఐ ఇంతియాజ్ బాష, ఎస్‌ఐ, నరేంద్ర సిబ్బంది రాము, బాష లు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి వెళ్లారు. వాహనంలోని డ్రైవర్, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తము హైవే వెహికల్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాన్ని పోలీసులు పక్కకు తీయించారు.

