TG | నేను మీ వాడిని..

TG | నేను మీ వాడిని..

  • ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా
  • 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి క్యాట్ అశోక్
  • కాలనీ అభివృద్దే నా లక్ష్యం

TG |షాద్ నగర్, ఆంధ్రప్రభ : నేను మీ వాడిని.. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను.. కమలం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని 9వ వార్డు అభ్యర్థి డేటా అశోక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ‌ వార్డులో ప్రజలను కాలనీలో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇక్కడ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాను కౌన్సిలర్ అయ్యాక కాలనీలోని అన్ని సమస్యలను పరిష్క‌రించి.. మీ ఇంటి మనిషిగా ఉంటానన్నారు. తొమ్మిదో వార్డును అందంగా సిద్ధంగా తీర్చిదిద్దే బాధ్యత నాదన్నారు. ప్రజలు ఆదరించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో ఇస్నాతి శ్రీను, అల్లం అనిల్ కుమార్ గౌడ్, గంగాధర్ ఇస్నాతి, సంజీవ రెడ్డి, రమేష్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, మనోహర్, పుట్నాల సాయికుమార్, రవి, అంజి, వివేక్, అభిలాష్, త‌దిత‌రులు పాల్గొన్నారు.