Balka Suman | అందుబాటులో ఉండి సేవలు అందించాలి

  • గెలుపోటములు సహజం..
  • మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్

క్యాతనపల్లి ఆంధ్రప్రభ : ప్రజల మద్దతుతో గెలిచిన సర్పంచులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మాజీ ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ తెలియజేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గం లో గెలుపొందిన సర్పంచులు, వార్డ్ మెంబర్లను ఘనంగా సన్మానించి కెసిఆర్ చిత్రపటం అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషిచేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.

రానున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పార్టీ కేటాయించిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజంమని, ఎన్నికల్లో ఓడిన వారికి పార్టీ మద్దతు ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, నూతన సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.