Ayyappa Swami | మహాప్రసాదం పంపిణీ
Ayyappa Swami | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఇవాళ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురుస్వామి ఇవాళ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప స్వామి వారి మహా ప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు.
అయ్యప్ప స్వామి దీక్ష మండల కాలం పూజలు పూర్తి చేసుకొని శబరిమల అయ్యప్ప స్వామి మకరజ్యోతి దర్శనం చేసుకుని ఈ ప్రాంతంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా పట్టణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ ప్రత్యేక పూజ ప్రసాద పంపిణీ కార్యక్రమంలో ఆలయ పూజారి గోవిందు మిశ్రా, భాస్కర్, హరీష్ రెడ్డి, లింగస్వామి, నరసింహ, కృష్ణయ్య, మహేష్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
