AYYAPPA| కఠోర దీక్షతో అయ్యప్ప మాలలు..

AYYAPPA| బిక్కనూర్, ఆంధ్రప్రభ: కఠోర దీక్ష కోసం అయ్యప్ప మాలలు వేసుకోవడం జరిగిందని పలువురు అయ్యప్ప స్వాములు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు శనివారం అయ్యప్పమాలను ధరించారు. ఈ సందర్భంగా వారు మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప ఆలయానికి తరలివచ్చారు. అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకొని మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం గురుస్వాములు మాట్లాడుతూ.. 41 రోజులు స్వామివారి కఠోర దీక్షతో మాల కొనసాగించడం జరుగుతుందన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాల ధరించిన అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Leave a Reply