TG LIVE | బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం .. స‌భ‌లో ప్ర‌సంగిస్తున్న గ‌వ‌ర్న‌ర్..

హైదరాబాద్ : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి.. దీనిలో భాగంగా తొలిరోజైన నేడు ళ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్ర‌సంగిస్తున్నారు. . దాదాపు గంటపాటు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఈ ప్ర‌సంగం అనంత‌రం మరుసటి రోజుకు సభ వాయిదా పడ‌నుంది.

అసెంబ్లీ కి కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలోనే కేసీఆర్‌ అసెంబ్లీకి వ‌చ్చారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయ‌న‌కు బిఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు స్వాగ‌తం ప‌లికారు.. అనంత‌రం ఆయ‌న స‌భ‌లో త‌న‌కు కేటాయించిన సీటులో కూర్చున్నారు.. .

ఇది ఇలా ఉంటే ఈనెల 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండు వారాలపాటు అంటే ఈనెల 27 వరకు సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురానుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటితోపాటు ఇతర బిల్లులు కూడా అసెంబ్లీ, కౌన్సిల్ ముందుకు రానున్నాయి. పలు అంశాలు కూడా బడ్జెట్ సమావేవాల్లో చర్చకు రానున్నాయి.

Leave a Reply