- జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులైన రాజశ్రీ
వరంగల్‌కు చెందిన బి.రాజశ్రీ 19 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కారుణ్య నియామకం కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చారు. రాజశ్రీ ని హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ.. ఆ కుటుంబంలో సంతోషం నింపారు.
రాజశ్రీ తండ్రి బి.భీమ్ సింగ్ 1996 సెప్టెంబర్ 24న విధి నిర్వహణలో ఉండగా ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మరణంతో కారుణ్య నియామకానికి రాజశ్రీ దరఖాస్తు చేశారు. అయితే అప్పటి ప్రభుత్వాలు వివిధ కారణాలు చూపుతూ ఉద్యోగాన్ని నిరాకరించాయి.
ఈ విషయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, నిబంధనలు సడలిస్తూ రాజశ్రీకు ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
తాజాగా ప్రభుత్వం జారీ చేసిన నియామక ఉత్తర్వులతో రాజశ్రీ హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.