26న నార్సింగిలో తైబజార్ వేలం…

26న నార్సింగిలో తైబజార్ వేలం…

మెద‌క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మెద‌క్ జిల్లా నార్సింగి గ్రామపంచాయతి కార్యాలయంలో 2026-27 సంవత్సరానికి తైబజార్ వేలం తేది 26 మార్చి ఉదయం 11 గంటలకు సర్పంచి ఆకుల సుజాతమల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో ఈవో నాగభూషణం సమక్షంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రూ.50,000 డిపాజిట్‌తో వేలంలో పాల్గొనవచ్చని, అత్యధిక ధర పలికిన వారికి హక్కులు కల్పిస్తామని చెప్పారు.

విజేతలు సగం మొత్తాన్ని వెంటనే చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 2026లోపు చెల్లించాలని సూచించారు. నిబంధనలు పాటించని పక్షంలో వేలం రద్దు చేయవచ్చని హెచ్చరించారు. గత ఏడాది ధరలకే వసూలు చేయాలని కూడా పేర్కొన్నారు.