అక్రమ అరెస్టు అప్రజాస్వామికం…
అక్రమ అరెస్టు అప్రజాస్వామికం…
బీఆర్ ఎస్ వి నాయకుల ముందస్తు అరెస్టు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఉట్నూర్ ఎస్సై విజయ ఆధ్వర్యంలో పోలీసులు బి ఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ తో పాటు నాయకులు సాడిగే రాజ్ కుమార్, బాబా శ్యామ్ క్రాంతి పవార్ మధస్తు దినేష్ లను పోలీసులుపోలీసులు అరెస్టు చేసి ఉట్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ మాట్లాడుతూ.. ఏ చిన్న కార్యక్రమం అయినా అరెస్టులతో ఆగమాగం అవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
అడుగడుగునా అక్రమ అరెస్టులతో ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్.సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేవలం 12000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినాడని అదే విధంగా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఇంత వరకు కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు గాని ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి అక్రమ అరెస్ట్ లు ఎన్ని చేసిన ఉద్యమాన్ని ఆపలేరని ధరణి రాజేష్ అన్నారు.
