Arshdeep | కోహ్లీ వీడియోతో పాటు 200 పోస్టులు అవుట్.. అసలేం జరిగింది?

Arshdeep | కోహ్లీ వీడియోతో పాటు 200 పోస్టులు అవుట్.. అసలేం జరిగింది?

Arshdeep | సోషల్ మీడియాలో ఊహించని నిర్ణయం
కోహ్లీ వీడియోపై క్రేజీ వైరల్ చర్చలు
రూమర్స్ శరవేగం
వివాదాలకు చెక్ పెట్టిన ఇన్‌సైడ్ సమాచారం

Arshdeep | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: టీమిండియా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సోషల్ మీడియాలో తీసుకున్న ఒక ఊహించని నిర్ణయం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లోనే కాదు, సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అర్ష్‌దీప్ ఒకేసారి 200కు పైగా పాత పోస్టులను డిలీట్ చేశాడు. అయితే ఈ క్లీనప్ ప్రక్రియలో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక క్రేజీ వైరల్ వీడియో కూడా మాయమవ్వడం నెటిజన్లను, క్రికెట్ అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రూమర్స్ శరవేగం..
గతంలో టీమిండియా సాధించిన ఒక చారిత్రాత్మక విజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో సెలబ్రేషన్స్ చేసేకున్న సమయంలో విరాట్ కోహ్లీతో కలిసి అర్ష్‌దీప్ సింగ్ చేసిన ఫన్నీ డ్యాన్స్ వీడియో అప్పట్లో తెగ వైరల్‌ గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన ఆ క్రేజీ వీడియో ఇప్పుడు అర్ష్‌దీప్ ప్రొఫైల్‌లో మాయమైపోయింది.

దీనితో సోషల్ మీడియా వేదికగా రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీకి, అర్ష్‌దీప్‌కు మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా?, సడన్‌గా ఆ వీడియోనే ఎందుకు తీసేశారు? .. అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

రూమర్లకు చెక్..
ఈ వివాదంపై ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వర్గాల ప్రకారం.. విరాట్ కోహ్లీతో విభేదాలు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అర్ష్‌దీప్ సింగ్ కేవలం కోహ్లీ వీడియో మాత్రమే కాకుండా, తన కెరీర్ ప్రారంభం నుండి ఉన్న వ్యక్తిగత ఫొటోలు, పాత లీగ్ మ్యాచ్‌ల జ్ఞాపకాలతో సహా దాదాపు 200కు పైగా పోస్టులను ఒకేసారి తొలగించాడని సమాచారం.

ప్రస్తుతం పెద్ద పెద్ద అంతర్జాతీయ క్రీడాకారులు తమ సోషల్ మీడియా బ్రాండ్ వాల్యూను పెంచుకోవడానికి ప్రొఫైల్‌ను పూర్తిగా రీ-బ్రాండ్ చేస్తుంటారు. డిజిటల్ పీఆర్ మేనేజ్‌మెంట్ సంస్థల సలహా మేరకు ప్రొఫైల్‌ను మరింత ప్రొఫెషనల్‌గా మార్చేందుకే అర్ష్‌దీప్ ఈ ‘సోషల్ మీడియా క్లీనప్’ చేసినట్లు స్పష్టమవుతోంది

CLICK HERE TO READ 2013Final | ముంబై తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలిచి 13 ఏళ్లు..

CLICK HERE TO READ MORE

Leave a Reply