ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య స్థాయి తీవ్రంగా పెరుగుతుండటంతో.. ఢిల్లీలో మూడు రోజులు నివసిస్తే జబ్బు చేయడం ఖాయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజధానిలో నెలకొన్న ఎయిర్ పొల్యూషన్ పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలో నివసించేవారికి 10 ఏళ్ల ఆయువు తగ్గినట్లే. ఢిల్లీతో పాటు ముంబైలో కూడా ఇదే పరిస్థితి. దీనిపై అత్యవసర చర్యలు తీసుకోవాలి. ఇంధనాల వాడకాన్ని భారీగా తగ్గించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Pollution | ఢిల్లీలో ఉంటే 10ఏళ్ల ఆయువు తగ్గినట్లే : గడ్కరీ
