సామాజిక సేవలకు జాతీయ గుర్తింపు..

  • యంకీ రమేష్‌కు అంబేద్కర్ సేవా రత్న అవార్డు

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు ఇతర బహుజన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలను గుర్తించి మహబూబ్‌నగర్‌కు చెందిన యంకీ రమేష్‌కు డా. బి.ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు ప్రదానం చేశారు.

హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు, ఎస్‌సీఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఆది హిందూ ప్రజల జేఏసీ మహబూబ్‌నగర్ జిల్లా చైర్మన్ నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా యంకీ రమేష్ ఈ అవార్డును అందుకున్నారు.

సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందించినందుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా యంకీ రమేష్ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా సమాజ సేవలో మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.