బీజేపీ బీఎల్ఏ-2 అవగాహన సదస్సుకు ఏర్పాట్లు పూర్తి..
మునుగోడు, ఆంధ్రప్రభ : ఈనెల 27న నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని మనీ గార్డెన్లో నిర్వహించనున్న బీజేపీ నియోజకవర్గ స్థాయి బీఎల్ఏ-2 అవగాహన సదస్సు ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూడల బిక్షం గౌడ్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై బీఎల్ఏ-2లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏ-2లు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరుకానుండగా, బీజేపీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.
కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలనలో జిల్లా అధికార ప్రతినిధి మాదగోని నరేందర్ గౌడ్, మునుగోడు మండల అధ్యక్షుడు పెంబళ్ల జానయ్య, గట్టుప్పల్ మండల అధ్యక్షుడు రావుల ఎల్లప్ప, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దండు భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
