అర్జిదారులను కార్యాలయం చుట్టూ తిప్పుకోకూడదు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రెవిన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అర్జీదారులను కార్యాలయం చుట్టూ తిప్పుకోకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

జిల్లా లోని ఉయ్యాలవాడ తాహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జె సి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని వీఆర్వోలకు సూచించారు.

అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వారికి అర్థమయ్యే విధంగా ఎండార్ మెంట్ క్లియర్ గా ఇవ్వాలన్నారు. ఉయ్యాలవాడ మండలంలో ఎక్కువగా భూసమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, భూ సమస్యల పరిష్కారానికి తాహసిల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ పి.జి.ఆర్ఎ.స్. అర్జీలను ఎలా క్లియర్ చేస్తున్నారని పరిశీలించారు. అర్జీదారునికి ఎండార్స్మెంట్ ఎలా ఇస్తున్నారు, తదితర వివరాలను వీఆర్వోలకు సూచించారు. ఈ సందర్భంగా పలు రెవిన్యూ అంశాలకు సంబంధించి తహసిల్దార్, విఆర్వోలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, ఆర్. ఐ, విఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply