నంద్యాలలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య..

నంద్యాలలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య..
సూసైడ్ నోట్ లో కలిసి వేసే పదాలు…
నా శవాన్ని కుక్కలకు వేయండి.. ఆ యువకుడు సూసైడ్ నోట్ లో రాసిన పదాలు…
నంద్యాల బ్యూరో ,ఆంధ్రప్రభ : నంద్యాల సమీప ప్రాంతాల్లో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుందని రైల్వే ఎస్సై కుమారి తెలిపారు.ఈ సంఘటన లో చిరంజీవి 25 అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవటం జరిగిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న చిరంజీవి తల్లిదండ్రులకు భారం అయ్యాన ని భావించి ఈ ఆత్మహత్య తీసుకుంటున్నానని నా శవాన్ని కుక్కలకు వెయ్యండి తల్లిదండ్రులకు ఇవ్వవద్దు అంటూ సూసైడ్ నోట్లో రాసిన వాక్యాలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పడకండ్లకు చెందిన మునేయ్యకు నలుగురు సంతానం పుట్టి చనిపోయారు. ఐదవ సంతానమ్మ చిరంజీవి జన్మించాడు. చిరంజీవి పుట్టుకతోనే మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడని తెలిపారు. వైద్యం కోసం తండ్రి లక్షల రూపాయలు ఖర్చు చేశాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు భారమయ్యానని భావించి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవటం విశేషం. పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్న ట్లు తెలిపారు.
