Vijayawada | రహదారుల ఆక్రమణలు సహించం..

Vijayawada | రహదారుల ఆక్రమణలు సహించం..
- ఆక్రమణల దారులను హెచ్చరిస్తున్న సిఐ కిషోర్ బాబు
- రహదారుల ఆక్రమణలపై సిఐ కిషోర్ బాబు కఠిన హెచ్చరిక..
- స్వచ్ఛందంగా తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం..
- ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక..
- ప్రజల సౌకర్యం కోసం కఠిన చర్యలకు వెనుకాడబోమని స్పష్టం..
Vijayawada | విజయవాడ , క్రైమ్ ఆంధ్రప్రభ : విజయవాడ సత్యనారాయణపురంలోని త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారుల ఆక్రమణలపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు తెలిపారు. ఎన్.ఆర్.పి రోడ్డులోని శారద కాలేజ్ జంక్షన్ నుంచి ఐరాక్స్ థియేటర్ వరకు కొంతమంది వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు, వాహనాల సాఫీ ప్రయాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా రహదారులపై ఆక్రమణలు సంబంధిత వ్యాపారస్తులకు స్వచ్ఛందంగా వెంటనే ఆక్రమణలు తొలగించుకోవాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ జీవీఎన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు

