శ్రీసీతారామయ్య ఫస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకారం

శ్రీసీతారామయ్య ఫస్ట్ బోర్డు కమిటీ ప్రమాణ స్వీకారం
కమిటీచే ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమా
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : శ్రీ సీతారామయ్య ఫస్ట్ బోర్డు ఛైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం పాయకాపురం ప్రాంతంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కోలా శ్రీను, డైరెక్టర్లు దేవరకొండ లక్ష్మణ్,రమణమ్మలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఘంటా కృష్ణ మోహన్, నవణితం,బొమ్మదేవర రత్న కుమారి,పైడి శ్రీను,మోతుకురి ఖాసిమ్,ఆకుల సూర్యప్రకాష్,కంచేటి నాగరాజు, పసుపులేటి వీరాస్వామి,బుదాల సురేష్, తదితరులు పాల్గొన్నారు.
