ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలి..

ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందుండాలి..

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ కొత్త రాజరాజేశ్వరి పేటలో యాదవుల బజార్లో వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చడానికి టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు దేవర సత్యనారాయణ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆదివారం దేవర యూత్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తనయుడు బొండా రవితేజ పాల్గొని పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ విజయవాడలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీరు, మజ్జిగ వంటి శీతల పానీయాలు అందించడం ఎంతో అవసరమన్నారు.

ముఖ్యంగా కార్మికులు, రోజువారీ కూలీలు, వృద్ధులు, రోడ్లపై ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని అన్నీ డివిజన్లో వేసవి కాలంలో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సెంట్రల్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు దేవర సత్యనారాయణ,రాష్ట్రనాయకులు నవణితం, నాగవంశం చైర్మన్ ఎరుబోతు రమణారావు, చల్లపు గణేష్, యలమంచిలి రమణ బాబు, అప్పాలరాజు,వరహాలు కొండలరావు,కబీర్, ఇమ్మనుఎల్,పాండు, వేణు, రేణుక,లీలావతి,ఈశ్వరి, శైలజ తదితరులు పాల్గొన్నారు.`