పర్వతగిరిలో ప్రజావాణి..
- ఈ నెల 17 నుంచి ప్రతి సోమవారం కార్యక్రమం
- ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీల స్వీకరణ
- మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీఓ
పర్వతగిరి, ఆంధ్రప్రభ : పర్వతగిరి మండల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఒక ప్రకటనలో తెలిపారు. పర్వతగిరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు, అవసరాలకు సంబంధించిన వినతిపత్రాలను ఈ సమయంలో అధికారులకు సమర్పించవచ్చని తెలిపారు. మండల ప్రజలందరూ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కోరారు.
