ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష భారత చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించిందన్నారు.

పొట్టి శ్రీరాములు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం తెలుగు ప్రజల ఐక్యతకు, రాష్ట్ర నిర్మాణానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. పొట్టి శ్రీరాములు చూపిన త్యాగం, నిబద్ధత, ప్రజాసేవా భావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు. యువత పొట్టి శ్రీరాములు జీవితాన్ని తెలుసుకొని సమాజానికి సేవ చేయాలనే స్పూర్తిని పొందాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఎ.రవీంద్రరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి.సృజన, ఎస్టేట్ ఆఫీసర్ ఎ.శ్రీధర్, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణ మూర్తి, డెప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, యస్ ఈ (వర్క్స్) చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాస్, గోపాలకృష్ణ, బయాలజిస్ట్ కామేశ్వరరావు, వి ఏ ఎస్ డాక్టర్ డి.హరీష్, మేనేజర్ ప్రభావతి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply