Ambati Rambabu | అమరావతి ఘటనపై అంబటి ఫైర్

Ambati Rambabu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం తమపై పెడుతున్న అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ భయపడబోదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై, టీడీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.

అమరావతి రైతులను పరామర్శించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడి చేశారని అంబటి ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదును పట్టించుకోలేదని విమర్శించారు.

దాడికి పాల్పడింది టీడీపీ నాయకులేనని, అయినప్పటికీ తమపైనే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. కానిస్టేబుల్‌పై దాడి జరిగినా సంబంధిత వారిపై పోలీసులు చర్యలు తీసుకోలేదని, చట్టాన్ని ఏకపక్షంగా అమలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కక్షసాధింపు కోసం కేసులు నమోదు చేసినా వైఎస్సార్సీపీ వెనక్కి తగ్గదని, ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.