చెరువు మరమ్మత్తులు అభివృద్ధి పనులు ప్రారంభం….

చెరువు మరమ్మత్తులు అభివృద్ధి పనులు ప్రారంభం….

వత్సవాయి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని లింగాల గ్రామంలో గుండ్ల చెరువు మరమ్మత్తులు అభివృద్ధి పనులకు జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండపు జనార్ధన్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో చెరువుల పునరుద్ధరణకు కీలక పాత్ర ఉందన్నారు. గుండ్ల చెరువు అభివృద్ధి పనులు పూర్తయితే రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాల స్థాయి కూడా పెరుగుతుందని తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply