జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా చలసాని
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన చలసాని శ్రీనివాసరావు ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశంతో నియమించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఉపాధ్యక్షుడిగా నియమించినందున కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. తనను నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
