Cabinet Expansion | మంత్రివర్గంలో మార్పులకు సంకేతాలు

Cabinet Expansion | మంత్రివర్గంలో మార్పులకు సంకేతాలు

కేబినెట్ విస్తరణకు ముందు బీజేపీ కీలక నిర్ణయాలు

Cabinet Expansion | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్‌లో కీలక మార్పులు చేపట్టనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన పలకడంతో పాటు కొత్త ముఖాలకు అవకాశం కల్పించే దిశగా బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల మధ్య కేంద్ర సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి భవన్ వెంటనే ఆమోదించినట్లు సమాచారం. దీంతో రాబోయే కేబినెట్ విస్తరణలో ఆయన స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేరళకు చెందిన బీజేపీ నేత జార్జి కురియన్ 2024లో జరిగిన ఉప ఎన్నికల ద్వారా మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనంతరం కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వకూడదని బీజేపీ నిర్ణయించింది.