టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడిగా అడెం మల్లేశం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ ఉపాధ్యక్షుడిగా అడెం మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్‌లో నిర్వహించిన జిల్లా మహాసభలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మహాసభ అనంతరం ఎన్నికల అధికారి సిద్ధన్న అధ్యక్షతన జిల్లా కమిటీ ఎన్నికల ప్రక్రియ నిర్వహించి, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన అడెం మల్లేశం తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్ అహ్మద్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంఘం బలోపేతం కోసం ఇతర నాయకులతో సమన్వయంగా పనిచేస్తానని పేర్కొన్నారు.