Additional Collector | ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలి

మిల్లర్లకు అద‌న‌పు కలెక్టర్ వీరారెడ్డి సూచ‌న‌

Additional Collector |మోత్కూర్, ఆంధ్రప్రభ : రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వ‌రిత‌గ‌తిన లారీల ద్వారా దిగుమ‌తి చేసుకోవాల‌ని యాదాద్రి భువనగిరి జిల్లా అద‌న‌పు కలెక్టర్ జి వీరారెడ్డి మిల్లర్లకు సూచించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మిల్లు యజమాలతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రైతుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ధాన్యాన్ని దిగుమతి చేసేందుకు మిల్లర్లు సహకరించాలని కోరారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేప‌ట్టాల‌ని తహసీల్దార్ జ్యోతిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవ‌ద్ద‌ని సూచించారు. మిల్లర్లు నాణ్యత ప్రమాణాల పేరుతో కొర్రీలు పెట్టొద్దన్నారు. ఈ సమావేశంలో మిల్లర్లు సోమ నర్సయ్య, బుస్స శ్రీనివాస్, మిట్టపల్లి నగేష్, సోమ వెంకన్న, తీపిరిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు.