Accident | ఆగి ఉన్న టిప్ప‌ర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు

Accident | ఆగి ఉన్న టిప్ప‌ర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు

ముగ్గురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలో ఘ‌ట‌న‌

Accident | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళా ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి గురైన బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఢీకొట్టడం తీవ్రంగా ఉండటంతో బస్సు ముందు భాగం, కుడి వైపు పూర్తిగా దెబ్బతింది. సీట్లు బలంగా ఊడిపోయి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply