రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం..

వేములవాడ, ఆంధ్రప్రభ : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన భీమన్న ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. సెలవు దినాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజామునే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు.

స్వామివారి సేవలో పాల్గొన్న భక్తులు దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వర్గాల సమాచారం ప్రకారం, ఆదివారం ఒక్కరోజే సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.

Leave a Reply