ACB Attack | లంచంతో చిక్కిన సర్వేయర్

ACB Attack | లంచంతో చిక్కిన సర్వేయర్

ACB Attack | వెల్దుర్తి, ఆంధ్రప్రభ : భూమి సర్వే కోసం రైతు వద్ద నుండి రూ.20,000 లంచం తీసుకుంటూ వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం సర్వేయర్ శ్రీనివాస్ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బుధవారం మండల కేంద్రమైన వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు మెరుపు దాడిచేశారు.

ఈ దాడిలో సర్వేయర్ శ్రీనివాస్ (Surveyor Srinivas) మండల కేంద్రమైన వెల్దుర్తికి చెందిన ఒక రైతు (Farmer) పొలాన్ని సర్వే చేయడం కోసం రూ.20వేల లంచం డిమాండ్ చేయగా.. పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ డీఎస్పీ (ACB DSP) సుదర్శన్ సిబ్బందితో కలిసి సర్వేయర్ శ్రీనివాస్ ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply