పిడుగుపాటుతో తాటి చెట్టు దగ్ధం
పిడుగుపాటుతో తాటి చెట్టు దగ్ధం
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలోని ఎ.కొండూరు మండల పరిధిలోని ఓ తండాలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సందర్భంగా పిడుగు తాటి చెట్టుపై పడటంతో చెట్టు పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం, భారీ ఉరుములు, మెరుపుల మధ్య ఒక్కసారిగా పిడుగు పడటంతో తాటి చెట్టులో మంటలు చెలరేగాయి. దీంతో చెట్టు కాలిపోయి దగ్ధమైంది. ఘటన సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పిడుగుపాటు ఘటనతో తండా వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వర్షాకాలంలో ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
