Palamuru | గృహ జ్యోతి పథకం బాండ్ అందజేత

Palamuru | పాలమూరు, ఆంధ్రప్రభ : పోమాల్‌లో గృహ జ్యోతి పథకం బాండ్ లబ్ధిదారులకు సర్పంచ్ కవితనరేష్, ఉప సర్పంచ్ ఆంజనేయులు అందజేశారు. ఈ రోజు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ఎన్నికల భాగంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో ఒకటైన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించి మధ్యతర‌గ‌తి కుటుంబాలకు, పేదలకు ఆర్థిక పరమైన వెసులుబాటు కలిగించిన ప్రజా ప్రభుత్వం.. ఒక్క పోమాల్ గ్రామంలో 385 మందికి ఈ పతకం ద్వారా లబ్దిచేకూరింది. లబ్ధిదారులు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి దుష్యంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోమాల్ వార్డ్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply