distribution | సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

distribution | మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు రూ.24,52,000 సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సర్పంచులతో కలసి చెక్కులను పంపిణీ చేశామన్నారు.
అనంతరం కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ప్రత్యేక సిబ్బందిని నియమించి సేవలందిస్తున్నారని అన్నారు. కరోనా కష్ట సమయంలో రూ. ఏడు కోట్ల తో నిత్యవసర సరుకులు పంపిణీ చేసి నిరుపేదల ఆకలి తీర్చిన ఘనత రాజగోపాల్ రెడ్డికే దక్కిందన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కులు అందుకున్న ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్నవారికి సీఎం సహాయనిధి పై అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
