EX MLA | కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి..
EX MLA | కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి..
- మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
EX MLA | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిట్యాల పట్టణ ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఇవాళ నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల బాకీ కార్డులను ఇంటింటికి వెళ్లి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంపిణీ చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బాకీ ఉన్న మొత్తాన్ని వివరిస్తూ ఆయన వార్డులలో తిరుగుతూ పుర ప్రజలకు వివరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి, ప్రజా సంక్షేమానికి పాటుపడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
