Nalgonda | ఘనంగా వివేకానంద జయంతోత్సవాలు

Nalgonda | ఘనంగా వివేకానంద జయంతోత్సవాలు

Nalgonda | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో వివేకానంద జయంతోత్సవాలు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ నామని జగన్నాథం, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు రావుల యల్లప్ప వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, స్వీట్లు పంపిణీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ… మత మార్పిడులు జరగకుండా చూడాలని చికాగో నగరంలో పాల్గొన్న సర్వమత సమ్మేళనం మధుర స్మృతులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నామని దత్తాత్రి, బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి చిలువేరు దుర్గయ్య, ప్రధాన కార్యదర్శిలు ఇడం రాజు, నాగులగాని శ్రీనివాసులు, ఏలే మారయ్య, బ్రహ్మయ్య, చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply