3 Dea*ths I దామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

3 Dea*ths Iదామరచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

మిర్యాలగూడ, ఆంధ్రప్రభ:
దామరచర్ల మండల కేంద్ర శివారులోని లారీ యార్డు సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

మృతులను దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన బత్తుల ధనుంజయరావు, నరసింహారావు, అలాగే దాచేపల్లి మండలానికి చెందిన డెక్క వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply