Narsingi | వాలీబాల్ ఫైనల్ సమరం

Narsingi | వాలీబాల్ ఫైనల్ సమరం

  • నేడు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు

Narsingi | నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి గ్రామంలో ఉత్కంఠభరితంగా సాగుతున్న నార్సింగి వాలీబాల్ లీగ్ చివరి దశకు చేరుకుంది. గ్రామ యువతను క్రీడల వైపు ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో ఇవాళ‌ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనుండడంతో క్రీడాభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

నార్సింగి గ్రామంలో నిర్వహిస్తున్న ఈ వాలీబాల్ లీగ్‌కు నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్, ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డి, కాలేరు యోగి, ZPTC కిష్టారెడ్డి, BRS మండల అధ్యక్షుడు కుమ్మరి బాబు, చెప్రాసి స్వామి, కందరి నవీన్ విశేషంగా సహకరించారు. లీగ్‌ను విజయవంతంగా నిర్వహించడంలో ఆర్గనైజర్స్ వరాల ప్రవీణ్, సందీప్, సాయి, రజినీకాంత్, సునీల్, రాము, సమీర్, శ్రీకాంత్ లు సమన్వయంతో పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రామ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ లీగ్‌ను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు హాజరై పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Leave a Reply