AP| వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి…

- మేడూరుకు ఎమ్మెల్యే కొలికపూడితో కలసి రాక…
- మంత్రి ఎమ్మెల్యే కు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అధికారులు…
- స్వామి వారికి ప్రత్యేక పూజలు…
- తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలంటూ పూజలు
(గంపలగూడెం, ఆంధ్రప్రభ) : తెలంగాణ (Telangana) పక్క రాష్ట్రమైన ఏపీ (Andhra Pradesh) లోని తిరువూరు నియోజకవర్గ (Tiruvuru Constituency) గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలో ఉన్న అతి పురాతన స్వయంభుగా వెలసిన వీరాంజనేయ స్వామి (Veeranjaneya Swamy) వారిని కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) దర్శించుకున్నారు.
తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) తో కలిసి ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ మర్యాదలతో అర్చకులు అధికారులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం ప్రత్యేక పూజలను నిర్వహించారు. వీరికి పేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు శేష వస్త్రం, స్వామి వారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆంజనేయ స్వామి వారిని కోరుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ ఏపీ రాష్ట్రాలు ప్రస్తుతం అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని, దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మంచి గుర్తింపు పొందుతున్నాయి అన్నారు.
