Students | శిక్షణ ఎంతో అవసరం..

Students | శిక్షణ ఎంతో అవసరం..
Students | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : చదువుతో పాటు అన్ జాబ్ శిక్షణ ద్వారా విద్యార్థులకు ఎంతో అనుభవం కలుగుతుందని ఒకేషనల్ విభాగం అధ్యాపకులు అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు (Bikkanoor) మండల కేంద్రంలో ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులలో రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఒకేషనల్ విభాగం ఆఫీస్ అసిస్టెంట్ షీప్, అకౌంటెంట్ టాక్సేషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. బ్యాంకుల పనితీరు పై విద్యార్థులకు బ్యాంకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
ఈ కోర్సుల అధ్యాపకులు అశోక్ గౌడ్, శ్రీనివాసచారి, నర్సింలు గౌడ్, శ్రీదేవి మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్యార్థులకు (For students) చదువులో భాగంగా రెండు నెలల పాటు ఆన్ జాబ్ శిక్షణ ఉంటుందన్నారు. దీంట్లో భాగంగా విద్యార్థులకు వివిధ బ్యాంకులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఖాతాదారులకు బ్యాంకు ద్వారా అందుతున్న సేవల పై విద్యార్థులు పూర్తి అవగాహన కల్పించుకుంటున్నట్లు తెలియచేశారు. డిసెంబర్ 31 వరకు విద్యార్థులకు జాబ్ శిక్షణ కొనసాగుతుందని వారు చెప్పారు.
